కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష - etv bharath

11:00 September 23
కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
దృశ్యమాధ్యమం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీపీవోలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ధరణి సన్నద్ధతను సమీక్షించటంతో పాటు అనుమతులు లేని ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణ సంబంధిత అంశాలపై సమీక్షిస్తున్నారు. ధరణి పోర్టల్‌ను అమలు చేసేందుకు వీలుగా తహసీల్దార్ కార్యాలయాల్లో అవసరమైన ఐటీ, ఇతర మౌలికసదుపాయాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
పక్షం రోజుల్లోగా వ్యవసాయేతర ఆస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం నేపథ్యంలో సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు. వీటితోపాటు రైతువేదికల నిర్మాణం, పల్లెప్రకృతి వనాలు, వీధివ్యాపారులు, సీఎంఆర్ బియ్యం సంబంధించి సమీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తారు వర్షాలు...!