తెలంగాణ

telangana

ETV Bharat / state

RDF: 'ఆర్డీఎఫ్ నిధులతో చేపట్టిన పనుల్లో వేగం పెంచండి'

హైదరాబాద్​ బీఆర్కేభవన్​లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో నాబార్డు సీజీఎం వైకేరావుతో పాటు వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

By

Published : Aug 7, 2021, 3:46 PM IST

హైదరాబాద్​ బీఆర్కేభవన్
Cs somesh kumar

గ్రామీణ మౌలికవసతుల అభివృద్ధి నిధి (RDF) నిధులతో చేపట్టిన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (Somesh Kumar) అధికారులను ఆదేశించారు. సీఎస్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ బీఆర్కే భవన్​లో సమావేశమైంది. నాబార్డు సీజీఎం వైకేరావుతో పాటు వివిధ శాఖల కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు.

ఆర్ఐడీఎఫ్ నిధులతో నీటిపారుదల, మిషన్ భగీరథ, ఆర్ ​అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల్లో చేపట్టిన పనులను సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రానికి నాబార్డు మంజూరు చేసిన... ఇచ్చిన నిధులను నాబార్డు సీజీఎం వైకేరావు సమావేశంలో వివరించారు.

నాబార్డు నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్న సీఎస్ సోమేశ్ కుమార్... పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్ ఫాం సాగును విస్తృతంగా ప్రోత్సహించేందుకు వీలుగా తక్కువ మొత్తంలో ఆర్థిక సాయం చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని వ్యవసాయశాఖ కార్యదర్శికి సూచించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details