తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణ ప్రగతిపై సీఎస్​ సోమేశ్ ​కుమార్​ సమీక్ష - CS Somesh Kumar Review on Pattana Pragathi

పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సమీక్ష నిర్వహించారు. నిరక్షరాస్యులను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, హరితహారం, పబ్లిక్ టాయిలెట్లు, శ్మశానవాటికలు, నర్సరీలు, ఆటస్థలాలు, పార్క్​లకు ప్రత్యేకంగా ప్రాధాన్యమివ్వాలని ఆయన స్పష్టం చేశారు.

CS Somesh Kumar Review on  Pattana Pragathi
పట్టణ ప్రగతిపై సీఎస్​ సోమేశ్​కుమార్​ సమీక్ష

By

Published : Feb 20, 2020, 9:40 PM IST

పట్టణ ప్రగతి సన్నద్ధతపై సంబంధిత అధికారులతో సీఎస్​ సోమేశ్‌ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నిరక్షరాస్యుల వివరాలు గుర్తించేందుకు పట్టణ ప్రగతిలో భాగంగా ప్రత్యేక సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి వివరాల నమోదు కోసం పురపాలకశాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను పరిశీలించి మరింత సరళతరం చేయాలని సూచించారు.

మున్సిపాల్టీలు, వార్డులు, అధికారులకు సంబంధించిన వివరాలను తక్షణమే సేకరించాలన్న సీఎస్... పట్టణ ప్రగతిలో పాల్గొనే అధికారులతో బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 15 మందితో కూడిన నాలుగు ప్రజాకమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈ విషయంలో కొన్ని జిల్లాలు వెనకంజలో ఉన్నాయని తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన 14వ ఆర్థిక సంఘం నిధులను ఆర్థిక శాఖ విడుదల చేసిందని తెలిపారు. జీహెచ్​ఎంసీకి రూ.146కోట్లు, ఇతర కార్పొరేషన్లు, మున్సిపాల్టీలకు రూ.140కోట్ల రూపాయలు వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో ఆయనతోపాటు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక శాఖ సంచాలకులు సత్యనారాయణ పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిపై సీఎస్​ సోమేశ్​కుమార్​ సమీక్ష

ఇవీ చూడండి:మహాశివరాత్రి స్పెషల్: వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details