తెలంగాణ

telangana

ETV Bharat / state

నియామక ప్రక్రియ వేగవంతం.. ఖాళీల వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం - telangana employement

cs-somesh-kumar-review-meeting-with-all-departments
సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశం

By

Published : Dec 14, 2020, 5:02 PM IST

Updated : Dec 14, 2020, 5:42 PM IST

16:57 December 14

నియామక ప్రక్రియ వేగవంతం.. ఖాళీల వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశం

రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు.. అధికారులు చర్యలు చేపట్టారు. అన్నిశాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో డీజీపీ మహేందర్ రెడ్డి సహా వివిధ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.

ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీపై సమీక్షించిన సీఎస్‌.. అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతానికి ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నియామక ప్రక్రియ వేగవంతానికి రిక్రూట్‌మెంట్ విధానాల్లో సంస్కరణలు తీసుకురానున్నట్లు వివరించారు.

Last Updated : Dec 14, 2020, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details