CS Somesh kumar Review on vacancies : అన్ని శాఖల్లోని ఖాళీలను పూర్తి స్థాయిలో గుర్తించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ల జారీ కోసం త్వరగా మంత్రివర్గానికి వివరాలు నివేదించాలని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు వచ్చిన ఖాళీల వివరాలను తెలుసుకున్నారు.
అన్ని శాఖల్లో ఖాళీలపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష - తెలంగాణ టాప్ న్యూస్
CS Somesh kumar Review on vacancies : అన్ని శాఖల్లోని ఖాళీలను గుర్తించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. వీలైనంత త్వరగా వివరాలు మంత్రివర్గానికి నివేదించాలని అన్నారు. ఈ మేరకు కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
అన్ని శాఖల్లో ఖాళీలపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
ఐఏఎస్ అధికారి శేషాద్రి నేతృత్వంలో కమిటీ చేస్తున్న కసరత్తు విషయం గురించి ఆరా తీశారు. ఉద్యోగాల భర్తీకి త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని... ఇందుకు అనుగుణంగా వేగంగా ప్రక్రియ పూర్తి చేయాలని కార్యదర్శులను ఆదేశించినట్టు సమాచారం. పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:Swachh Bharat Mission 2022 : స్వచ్ఛభారత్ మిషన్‌లో ఆదర్శంగా కొత్తగూడెం..