ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా రాబోయే వారంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా బ్యాంకు ఉద్యోగులందరికి టీకా అందించేందుకు బ్యాంకు అధికారులతో పనిచేయాలని అధికారులను సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు.
CS Somesh Kumar: వారంలో అవుట్సోర్సింగ్, బ్యాంక్ ఉద్యోగులకు టీకాలు - CS Somesh Kumar latest news
హైదరాబాద్ బీఆర్కే భవన్లో పలు బ్యాంకుల అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్ సమావేశమయ్యారు. రాబోయే వారంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా బ్యాంకు ఉద్యోగులందరికి టీకా అందించేందుకు బ్యాంకు అధికారులతో పనిచేయాలని అధికారులను సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు.
CS Somesh Kumar
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పలు బ్యాంకుల అధికారులతో ఆయన బీఆర్కే భవన్లో సమావేశమయ్యారు. అక్టోబర్‌లోపు అందరికి వ్యాక్సిన్ అందేవిధంగా ప్రభుత్వం వ్యూహాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశాలున్న వారికి మొదటి విడతలో టీకా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి వ్యాక్సిన్లు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Harish rao: మీరు ఇవ్వరు.. మమ్మల్ని కొనుగోలు చేయనివ్వరు