తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై ఓ ప్రైవేటు హోటల్లో తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించిందని వెల్లడించారు. ప్రతి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో.. లో కోల్డ్ స్టోరేజి ఫెసిలీటీస్, క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్లు, కనీస వసతులన్నీ కూడా ఉంటాయన్నారు.
రైతులకు మెరుగైన ధరలు... వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు
రైతులకు మెరుగైన ధరలు, వారి పంటల ఉత్పత్తులకు విలువ పెంచే లక్ష్యంతో నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజనరీ నాయకత్వంలో ప్రభుత్వం సాగునీటి వసతుల కల్పనపై దృష్టి సారించిందని, తద్వార వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందన్నారు. ప్రస్తుతం రైతుల ఉత్పత్తులకు వాల్యూ అడిషన్పై దృష్టి సారించిందని, వ్యాపార వేత్తలు కీలకపాత్ర పోషించాలని అన్నారు. రైతులకు మెరుగైన ధరలు అందించాలని... వారి పంటల ఉత్పత్తులకు విలువ పెంచే లక్ష్యంతోనే నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఉందని తెలిపారు. అనంతరం వ్యాపారవేత్తలు వేసిన పలు సందేహాలను నివృత్తి చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రైవేట్ వ్యాపార వేత్తలను ప్రోత్సహించాలని ప్రభుత్వ పాలసీ ఉద్దేశమని, గతంలో దరఖాస్తు చేసుకోని వారికి సరైన సమయంలో మరొక సారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
ఇదీ చూడండి:KCR meet Modi : మోదీకి సీఎం కేసీఆర్ అందించిన పది లేఖల్లో ఏముంది? ప్రధాని స్పందనేంటి?