CS Somesh kumar Mother Passed Away: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు మాతృ వియోగం కలిగింది. గత మూడువారాలుగా అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మీనాక్షిసింగ్ కన్నుమూశారు. ఆమె సొంతూరు పాట్నాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మీనాక్షి సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సోమేష్ కుమార్‌ను ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. ఏఐజీ ఆస్పత్రిలో సోమేశ్ కుమార్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పరామర్శించారు. మీనాక్షిసింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీనివాస్ గౌడ్ ప్రార్థించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సీఎస్ సోమేశ్ కుమార్‌కు మాతృవియోగం
CS Somesh kumar Mother Passed Away: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు మాతృ వియోగం కలిగింది. అనారోగ్యంతో గత మూడు వారాలుగా హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మీనాక్షి సింగ్(85) కన్నుమూశారు. సొంతూరు పాట్నాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సీఎస్ సోమేశ్ కుమార్‌కు మాతృవియోగం