CS Someshkumar met CM KCR: తెలంగాణలో సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సీఎస్ భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన సోమేశ్‌కుమార్... తాజా పరిణామాలపై చర్చించారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణలో వివిధ హోదాల్లో కొనసాగిన సోమేశ్‌కుమార్... సీఎస్‌కు మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. అలాగే.. రాష్ట్ర రెవెన్యూ, ఆబ్కారీ, వాణిజ్యపన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, భూపరిపాలన కమిషనర్ వంటి కీలక పోస్టులనూ ఆయనే నిర్వహిస్తున్నారు. భూ రికార్డుల కంప్యూటరీకరణకు ఉద్దేశించిన ధరణి వెబ్‌సైట్ రూపకల్పనలో సీఎం కేసీఆర్‌తో పాటు కీలకపాత్ర పోషించారు.
సీఎం కేసీఆర్‌తో ముగిసిన సీఎస్ సోమేశ్‌కుమార్ భేటీ.. ఆ అంశాలపై చర్చ..! - కేసీఆర్‌ను కలిసిన సీఎస్ సోమేశ్‌కుమార్
15:05 January 10
సీఎం కేసీఆర్‌తో ముగిసిన సీఎస్ సోమేశ్‌కుమార్ భేటీ
2023 డిసెంబరు 31 వరకు సీఎస్ సోమేశ్ పదవీకాలం ఉండగా... తాజాగా హైకోర్టు తీర్పుతో సందిగ్ధత నెలకొంది. తెలంగాణలో సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వటంతో దీనిపై ఆయన అప్పీల్‌కు వెళ్లనున్నారు. ఈ పరిణామాల వేళ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌కుమార్‌ను రాష్ట్ర సర్కార్ కొనసాగిస్తుందా... అప్పీల్ కోసం తీర్పు నిలిపివేయాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చినందున ఆయన స్థానంలో మరొకరిని నియమిస్తుందా... అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాల వేళ... ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎస్ సోమేశ్‌కుమార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవాళ ఉదయం హైకోర్టులో సీఎస్ సోమేశ్‌కుమార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. క్యాడర్ కేటాయింపు వివాదంపై ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేసింది. అప్పీలుకు వెళ్లేందుకు తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌కుమార్‌ను కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించింది. కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి ఆయన తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో తెలంగాణలో సోమేశ్‌కుమార్ కొనసాగుతున్నారు. క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017లోనే కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం.. తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చదవండి: