Cs On Road Safety: రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు నిపుణుల కమిటీ నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Cs On Road Safety: రోడ్డు భద్రతా చర్యలపై నిపుణుల కమిటీ: సీఎస్
Cs On Road Safety: రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిపుణుల కమిటీ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోలీసు, ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. రోడ్డు భద్రతా చర్యలపై నిపుణుల కమిటీ సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
పోలీసు, ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులతో సీఎస్ భేటీ
ఇందులో పోలీసు, ట్రాఫిక్, రవాణా సంబంధిత సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడబోయే కమిటీలో లీడింగ్ ఏజెన్సీతో పాటు, ఈ రంగంలో విశేష అనుభవం ఉన్న నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు. పెరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన రోడ్డు భద్రతా చర్యలపై కమిటీ సూచనలు చేయనుంది. రోడ్డు భద్రతా నిధిని ఏర్పాటు చేసేందుకు కూడా సమావేశంలో సీఎస్ నిర్ణయం తీసుకున్నారు.