రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు 2018 ప్రకారం సంబంధిత శాఖల పరిధిలో ఉన్న పోస్టులను కేడర్ల వారీగా వర్గీకరిస్తూ ప్రతిపాదనలను ముసాయిదా రూపంలో వెంటనే పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులపై సీఎస్ సమీక్ష నిర్వహించారు.
'పోస్టుల వర్గీకరణలను ముసాయిదా రూపంలో వెంటనే పంపండి' - సీఎస్ సోమేశ్ కుమార్ తాజా వార్తలు
రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. 16 శాఖల అధికారులతో సమావేశమయ్యారు. 109 శాఖాధిపతులకు గాను 57 హెచ్ఓడీల నుంచి ప్రతిపాదనలు అందాయన్నారు.

'పోస్టుల వర్గీకరణలను ముసాయిదా రూపంలో వెంటనే పంపండి'
16 శాఖల అధికారులతో సమావేశమైన సోమేశ్ కుమార్.. పోస్టుల వర్గీకరణపై సమీక్షించారు. 109 శాఖాధిపతులకు గాను 57 హెచ్ఓడీల నుంచి ప్రతిపాదనలు అందాయన్నారు. మిగతా 52 హెచ్ఓడీలు వెంటనే ప్రతిపాదనలు పంపాలని కార్యదర్శులకు సీఎస్ తెలిపారు.
ఇవీ చూడండి:కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు