తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లకు సీఎస్​ ఆదేశం - తెలంగాణలో వర్షాలు

cs somesh kumar instructions to collectors on rains in telangana
అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్​ ఆదేశం

By

Published : Sep 26, 2020, 9:47 AM IST

Updated : Sep 26, 2020, 12:46 PM IST

09:41 September 26

అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సీఎస్​ ఆదేశం

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తోన్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్ అప్రమత్తం చేశారు. భారీ వర్షసూచన నేపథ్యంలో పూర్తి అలర్ట్ గా ఉండాలని, అధికారులందరూ హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరికీ సెలవులు లేవని... పబ్లిక్ హాలిడేస్ సందర్భంగా కూడా ఎవరికీ అనుమతి లేదని సీఎస్ స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాలు, వరదప్రభావానికి గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పారు. వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంకు అందించాలన్న ఆయన... ఏదైనా సంఘటన జరిగితే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పారు. 

 ఇదీ చదవండి:కర్నాటక మీదుగా ఆవర్తనం.. దక్షిణ తెలంగాణకు వర్షగండం

Last Updated : Sep 26, 2020, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details