హైదరాబాద్లో వరద ప్రభావిత కుటుంబాలకు రూ. 10వేల ఆర్థికసాయాన్ని వేగవంతం చేయాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఆర్థికసాయం పంపిణీ అంశంపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు.
ఆలస్యం కాకుండా ఇంటి వద్దే నగదు పంపిణీ కోసం జీహెచ్ఎంసీలో 300, శివారు మున్సిపాలిటీల్లో 50 బృందాలను ఏర్పాటు చేయాలని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ సంచాలకుల కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పంపిణీని పర్యవేక్షించాలన్న సీఎస్... ప్రభావిత ప్రాంతాలను గుర్తించి అవసరమైతే జిల్లాల నుంచి అధికారులను సమకూర్చుకోవాలని చెప్పారు.