రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతున్న తరుణంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీలో ర్యాపిడ్ ఫీవర్ సర్వేను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జీహెచ్‌ఎంసీలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే పరిశీలించిన సీఎస్ - హైదరాబాద్ తాజా వార్తలు
జీహెచ్ఎంసీ పరిధిలోని బొగ్గులకుంట అర్బన్ హెల్త్ సెంటర్‌ను సీఎస్ సోమేశ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ సిబ్బంది పనితీరు, ర్యాపిడ్ ఫీవర్ సర్వే వివరాలపై ఆరా తీశారు.

జీహెచ్‌ఎంసీలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే పరిశీలించిన సీఎస్
హెల్త్ సెంటర్‌లో కొవిడ్ కౌన్సెలింగ్ కేంద్రంను పరిశీలించిన సీఎస్... జ్వరం లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పలు వివరాలపై ఆయన ఆరా తీశారు.
ఇదీ చూడండి:బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో 8 మంది కొవిడ్ రోగులు మృతి