ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయో వివరాలు పంపాలని అన్ని శాఖలకు చెందిన స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్, సెక్రటరీస్‌ను సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 27తో పదోన్నతుల ప్రక్రియ పూర్తవుతుందని... దాని తరువాత శాఖలవారీగా ఎన్ని పోస్టులు, ఏయే క్యాటగిరీ పోస్టులు ఉన్నాయి.. అందులో నేరుగా నియామకం చేయాల్సినవి ఎన్ని తదితర వివరాలను తెలియచేయాలని సూచించారు. సమగ్ర వివరాలతో కూడిన సాప్ట్ కాఫీ కూడా సిద్ధం చేసి పంపాలని పేర్కొన్నారు.
ఎన్ని ఉద్యోగ ఖాళీలున్నాయో చెప్పండి: సీఎస్ - తెలంగాణ ఉద్యోగ సమాచారం
ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయో వివరాలు పంపాలని అన్ని శాఖల అధికారులకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. నేరుగా నియామకాలు చేయాల్సిన ఖాళీలపై సమీక్ష నిర్వహించి త్వరలో నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు వివరించారు.
cs somesh kumar, employment news, job notifications
50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా నియామకాల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు సోమేశ్‌కుమార్ తెలిపారు. నేరుగా నియామకాలు చేయాల్సిన ఖాలీలపై సమీక్ష నిర్వహించి త్వరలో నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి:'ఆక్రమణకు గురైన వక్ఫ్‌బోర్డు ఆస్తులు ఎన్ని స్వాధీనం చేసుకున్నారు..?'