రాత్రి వేళ దుకాణాలు మూసివేత తప్పుడు వార్త : సీఎస్
22:28 April 01
రాత్రి వేళ దుకాణాలు మూసివేత తప్పుడు వార్త : సీఎస్
దుకాణాల సమయం కుదింపు పుకార్లపై ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న జీవో కాపీ నకిలీదని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాత్రి వేళ దుకాణాలు మూసివేత తప్పుడు వార్త అని పేర్కొన్నారు. దుకాణాలు సాయంత్రం 6 గం.కు మూసివేయాలనేది నిజం కాదన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ ఉండదని చెప్పారు. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:సిరిసిల్ల నియోజకవర్గంలోని చెరువులు నింపాలి: కేటీఆర్