మల్టీలేయర్ ప్లాంటేషన్, రహదార్లు, వివిధ ప్రదేశాల్లో ఖాళీ లేకుండా మొక్కలు పెంచడంపై దృష్టి సారించేందుకు ట్రాక్ రూపొందించిన వ్యవస్థ ఉపయోగపడుతుందని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. మొక్కల పెంపకం, పర్యవేక్షణ కోసం తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ అభివృద్ధి చేసిన పర్యవేక్షణ వ్యవస్ధను బీఆర్కే భవన్లో సీఎస్, అధికారుల సమక్షంలో ప్రదర్శించారు.
కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా... వ్యవస్థ రూపొందించిన ట్రాక్
రాష్ట్రాన్ని పచ్చగా రూపొందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ట్రాక్ రూపొందించిన వ్యవస్థ ఉపయోగపడుతోందని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. మొక్కలు పెంచే ప్రాంతాలను తెలుసుకునేలా పోర్టల్, ప్లాంటేషన్, పూర్తి వివరాలతో డాష్ బోర్డును కూడా ట్రాక్ అభివృద్ధి చేసిందని వెల్లడించారు.
మొక్కలు పెంచేందుకు అవకాశమున్న అవెన్యూ, బ్లాక్, వ్యక్తిగత సైట్లను ఉపగ్రహ సమాచారం ఆధారంగా గుర్తించే అవకాశం ఉంటుందన్న సీఎస్... మొక్కలు పెంచే ప్రాంతాలను తెలుసుకునేలా పోర్టల్, ప్లాంటేషన్ పూర్తి వివరాలతో డాష్ బోర్డును కూడా ట్రాక్ అభివృద్ధి చేసిందని తెలిపారు. ట్రాక్ బృందానికి నేతృత్వం వహించిన శ్రీనివాసరెడ్డిని సీఎస్ అభినందించారు. రాష్ట్రాన్ని పచ్చగా రూపొందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవస్థ ఉందని సోమేశ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:రక్షణ కల్పిస్తారు.. అవగాహన కోసం వీడియోలు రూపొందిస్తారు..