తెలంగాణ

telangana

ETV Bharat / state

నవంబర్‌ కల్లా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ల రాత పరీక్షలన్నీ పూర్తి: సీఎస్ - పోలీస్ ఉద్యోగ నియామకాలు తాజా సమాచారం

CS Shantikumari Review on Job Recruitment : రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యోగాల నియామక ప్రక్రియపై సీఎస్ శాంతికుమారి సమీక్ష చేపట్టారు. నియామకాలపై డాష్‌బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని తెలిపారు. నవంబర్‌ కల్లా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ల రాత పరీక్షలన్నీ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆయా ఉద్యోగ ఖాళీలను వీలైనంత త్వరగా నోటిఫై చేయాలని అధికారులకు సూచించారు.

CS Shantikumari
CS Shantikumari

By

Published : Mar 14, 2023, 8:25 PM IST

CS Shantikumari Review on Job Recruitment : రాష్ట్రంలో జరుగుతున్న వివిధ శాఖల ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. దీని పురోగతి తెలిపేలా ప్రత్యేకంగా డాష్ బోర్డు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు ఆమె తెలిపారు. ఉద్యోగాల నియామకాలపై బీఆర్కే భవన్​లో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నియామక సంస్థలు, బోర్డుల అధికారులతో పాటు సాధారణ పరిపాలన, ఆర్థికశాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇప్పటి వరకు 17,285 ఉద్యోగాలకు సంబంధించి 17 నోటిఫికేషన్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. కొన్ని నోటిఫికేషన్ల ప్రాథమిక పరీక్షలు కూడా పూర్తి చేశామని... జులై మాసాంతంలోగా కొన్ని నోటిఫికేషన్ల రాత పరీక్షలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నవంబర్ మాసాంతం వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ కానున్న అన్ని నోటిఫికేషన్ల రాత పరీక్షలు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. పోలీస్ నియామక బోర్డు ద్వారా 17,516 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయని... ఏప్రిల్​లో రాత పరీక్షలు పూర్తి చేసి, సెప్టెంబర్ మాసంలోగా నియామకాలు జరుపుతామని స్పష్టం చేశారు.

మెడికల్, హెల్త్ సర్వీస్ బోర్డు ద్వారా ఆగస్టులోగా దాదాపు పది వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. గురుకుల నియామక బోర్డు ద్వారా కూడా పది వేల పోస్టులకు సెప్టెంబర్​లోగా నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఉద్యోగాల నియమాక ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రధాన కార్యదర్శి... సర్వీసు అంశాలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి కొన్ని శాఖలలో పెండింగ్​లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా ఉద్యోగ ఖాళీలను వీలైనంత త్వరగా నోటిఫై చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

'నియామకాలపై డాష్‌బోర్డు ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తాం. ఏప్రిల్‌లో పోలీసు నియామక రాత పరీక్షలు పూర్తి చేస్తాం. సెప్టెంబర్‌లోగా పోలీసు నియామకాలు జరుపుతాం. మెడికల్, హెల్త్ సర్వీస్ బోర్డు ద్వారా ఆగస్టులోగా ఉద్యోగాల భర్తీ. మెడికల్, హెల్త్ సర్వీస్ బోర్డు ద్వారా 10వేల ఉద్యోగాలు భర్తీ. సెప్టెంబర్‌లోగా గురుకుల బోర్డు ద్వారా 10 వేల పోస్టులు భర్తీ. నియమాకాల ప్రక్రియలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఉద్యోగ ఖాళీలను సంబంధిత శాఖలు వెంటనే నోటిఫై చేయాలి.'-శాంతికుమారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details