పెండింగ్ ప్రశ్నలకు వెంటనే సమాధానం పంపాలి: సీఎస్ - తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తాజా వార్తలు
15:23 September 03
పెండింగ్ ప్రశ్నలకు వెంటనే సమాధానం పంపాలి: సీఎస్
వర్షాకాల సమావేశాలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, సభ్యులు లేవనెత్తే అన్ని అంశాలకు తగు సమాధానాలు ఇచ్చే సమాచారం సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శాసనపరిషత్, శాసనసభ సమావేశాల నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో హైదరాబాద్ బీఆర్కే భవన్లో సీఎస్ సమావేశమయ్యారు.
అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని.. ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సీఎస్ స్పష్టం చేశారు. శాసనపరిషత్, శాసనసభలో పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలకు వెంటనే సమాధానాలు పంపించాలని సూచించారు. వివిధ శాఖల అధికారులు, అసెంబ్లీ అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. శాసనమండలిలోనూ సీనియర్ అధికారులు ఉండేలా చూడాలని కార్యదర్శులను ఆదేశించారు. సమావేశాల సందర్భంగా సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధించిన నోట్స్‌ను అధికారులు సిద్ధం చేసుకొని ఉండాలని సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.
ఇదీ చూడండి:ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన
TAGGED:
CS review with secretaries