ధరణి పోర్టల్‌లో సంస్థలు, కంపెనీల పేరున రిజిస్ట్రేషన్ మాడ్యూల్... జిల్లాల్లో వినియోగం విషయంలో అధ్యయనం కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ధరణికి సంబంధించిన అంశాలపై బీఆర్కే భవన్లో సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావుతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ధరణి పెండింగ్ మ్యుటేషన్ మాడ్యూల్ ద్వారా 74,688 దరఖాస్తులు రాగా కలెక్టర్ల 62,847 దరఖాస్తులను పరిశీలించారని అధికారులు తెలిపారు. సంస్థలకు, కంపెనీలకు పట్టదారు పాసుపుస్తకాలు జారీ చేయడానికి అవసరమైన మాడ్యూల్ ధరణిలో అందుబాటులో ఉందని, ఎన్ఆర్ఐ మాడ్యూల్‌ను కూడా అందుబాటులోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు.