ఘనవ్యర్థాలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, నదుల్లో కాలుష్యం, వ్యర్థజలాల శుద్ధి తదితర ఆంశాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ కోసం నెలాఖరు వరకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అధికారులతో బీఆర్కే భవన్లో సమావేశమైన సీఎస్... ఎన్జీటీ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై సమీక్షించారు.
'నెలాఖరు వరకు నివేదిక సమర్పించాలి'
ఎన్జీటీ సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై అధికారులతో బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్‌కుమార్ సమీక్ష నిర్వహించారు.
ఎన్జీటీపై సీఎస్ రివ్యూ
ఇప్పటి వరకు సాధించిన పురోగతిని... ట్రైబ్యునల్‌కు సమర్పించాల్సిన నివేదికలో పొందుపర్చాలని తెలిపారు. ట్రైబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం నిర్దిష్ట గడువులో కార్యాచరణ ప్రణాళిక అమలుకు తీసుకుంటున్న చర్యలను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ వివరించారు. గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణ తీరును పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ వివరించారు.
ఇవీ చూడండి: సంక్రాంతి పండగ రద్దీ.. సరిపోని రైళ్లు