తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రస్థాయి శిక్షణా సంస్థలపై సీఎస్​ ఉన్నత స్థాయి సమీక్ష - సీఎస్​ సమీక్ష

రాష్ట్రంలో శిక్షణా సంస్థలు మరింత బలోపేతమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. దీనికి సంబంధించిన అంశాలపై అధ్యయనానికి ఐపీఎస్​ అధికారి నేతృత్వంలో అధికారులతో కమిటీని నియమించారు.

సీఎస్​ సమీక్ష

By

Published : May 2, 2019, 10:13 PM IST

రాష్ట్రంలోని వివిధ శిక్షణా సంస్థలు, అకాడమీలు మరింత సమన్వయంతో ఉత్తమ పద్ధతులు పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి అన్నారు. సచివాలయంలో రాష్ట్ర స్థాయి శిక్షణా సంస్థలపై సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రా ఛైర్మన్​గా, తిరుపతయ్య కన్వీనర్​గా ఆయా శాఖల అధికారులతో కమిటీని నియమించారు. పౌరులకు నైపుణ్య శిక్షణ, జిల్లా స్థాయి శిక్షణా సంస్థలకు గుర్తింపు లాంటి అంశాలపై అధ్యయనం చేసి నెలరోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలకు అనుగుణంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని చెప్పారు.

శిక్షణా సంస్థలపై సీఎస్​ ఉన్నత స్థాయి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details