ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీకాలాన్ని.. మరో మూడు నెలలపాటు పెంచుతూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఆమె పదవీకాలాన్ని డిసెంబరు 31 తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఏడాది సెప్టెంబరు 30న.. ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉండగా... కొవిడ్ కారణంగా పదవీకాలాన్ని పెంచాలంటూ సీఎం జగన్.. ప్రధాని కార్యాలయానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు
ఏపీ రాష్ట్ర సీఎస్ నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో 3 నెలలపాటు ప్రభుత్వం పొడిగించింది. డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఏపీ సీఎస్ పదవీ కాలం పొడిగింపు
ఫలితంగా సీఎస్ పదవీకాలాన్ని మరోసారి పెంచుతూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలిచ్చింది. వాస్తవానికి జూన్ 30తో నీలం సాహ్నీ పదవీ విరమణ చేయాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం సెప్టెంబరు 30 వరకూ పదవీకాలాన్ని పెంచింది. తాజాగా డిసెంబరు 31 వరకూ... ఆమె పదవీకాలాన్ని పెంచుతూ ఆదేశాలు వెలువడ్డాయి.
ఇదీచూడండి:కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి