తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్‌ఎంసీలో ఇంటింటి సర్వే.. ఎందుకంటే? - ghmc covid cases

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా లక్షణాలు కలిగిన వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైరస్ వ్యాప్తి తాజా పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.

cs meeting
cs meeting

By

Published : May 4, 2021, 8:43 AM IST

జీహెచ్‌ఎంసీలో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో.. లక్షణాలు కలిగిన వారిని గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ప్రతి బృందంలో ఇద్దరు మున్సిపల్‌ స్టాఫ్‌, ఆశా వర్కర్లు, ఒక ఏఎన్‌ఎం ఉండేలా చూడాలని అధికారులకు స్పష్టం చేసింది. సీఎం ఆదేశాల మేరకు గ్రేటర్ పరిధిలో వైరస్ వ్యాప్తిపై సీఎస్ సోమేశ్‌కుమార్‌ సమీక్ష నిర్వహించారు. జోనల్‌, డిప్యూటీ కమిషనర్​లతో టెలీకాన్ఫరెన్స్‌లో సమావేశమై.. తాజా పరిస్థితులపై ఆరా తీశారు.

నగరంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, బస్తీ దవాఖానాలల్లో ఓపీ సేవలు ప్రారంభించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక బృందాల ద్వారా నిర్వహించే సర్వేలో లక్షణాలు కలిగిన వారిని గుర్తిస్తే.. వెంటనే వారికి ఈ-క్లీనిక్‌ల ద్వారా మెడికల్‌ కిట్‌లు అందజేయాలన్నారు. వారి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆయా బృందాలు పర్యవేక్షించాలని తెలిపారు. ఆస్పత్రుల్లో పరిశుభ్రతపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి, వైట్‌ వాష్‌ చేయించాలన్నారు. గ్రేటర్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ప్రారంభించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి:తెరాస అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపించాయి: హరీశ్‌ రావు

ABOUT THE AUTHOR

...view details