దేశంలో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న 'ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్' వేడుకలపై కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు భారీగా పాల్గొనేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
CS SOMESH KUMAR: ఫ్రీడం రన్ భారీ ఎత్తున నిర్వహించాం: సీఎస్
'ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్' వేడుకల నిర్వహణపై సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌గౌబా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొనేలా చూడాలని ఆయన ఆదేశించారు. మార్చి 12న జెండా ఎగురవేయటంతోనే రాష్ట్రంలో వేడుకలు ప్రారంభమయ్యాయని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.
CS SOMESH KUMAR
మార్చి12న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్‌లో జాతీయ జెండా ఎగురవేయటంతో.. వేడుకలు ప్రారంభమైనట్లు సమావేశంలో సీఎస్ సోమేశ్‌కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం రన్ భారీఎత్తున నిర్వహించామని సీఎస్ తెలిపారు. స్వాతంత్రోద్యమాన్ని తెలిపేలా కవి సమ్మేళనం, ఫోటో ప్రదర్శనలు నిర్వహించినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చూడండి:
free power: ఉచిత విద్యుత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: సీఎస్
Last Updated : Aug 5, 2021, 6:40 AM IST