తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యవసాయ శాఖ అధికారులతో సీఎస్ భేటీ - Agricluture Review

రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై సర్కారు దృష్టిసారించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ, వాతావరణ, రెవెన్యూ, ఆర్థికశాఖ అధికారులతో  సీఎస్ చర్చించారు. వర్షాభావం వల్ల రాష్ట్రంలో వ్యవసాయంపై పడుతున్న ప్రభావంపై చర్చించినట్లు సమాచారం.

వ్యవసాయ అధికారులతో సీఎస్ భేటీ

By

Published : Jul 26, 2019, 5:17 AM IST

Updated : Jul 26, 2019, 8:08 AM IST

తెలంగాణలో అధిక వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ప్రస్తుత వర్షాకాల సీజన్​లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు 27 లక్షల 64 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. వచ్చే నెలలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో పంటల సాగు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో వ్యవసాయ, వాతావరణ, రెవెన్యూ, ఆర్థికశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

జులై 25 వరకు సాధారణ విస్తీర్ణంలో 90 శాతం వరకు పంటలు సాగు అయ్యాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వరి మినహా మిగతా పంటల సాగు ప్రస్తుతం సంతృప్తికరంగా ఉందని వివరించారు. విత్తనాలు, ఎరువుల లభ్యతపైనా సమావేశంలో చర్చించారు. వాతావరణ పరిస్థితులు, పంటల సాగుపై ఆగస్టు 13న మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ జోషి నిర్ణయించారు.

వ్యవసాయ శాఖ అధికారులతో సీఎస్ భేటీ

ఇవీచూడండి: 'కొత్త అసెంబ్లీ డిజైన్ వివరాలివ్వండి'

Last Updated : Jul 26, 2019, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details