లాక్డౌన్లో ఇంటికే పరిమితం అయిన వారి ఆరోగ్య నిమిత్తం భారత ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ కార్యక్రమం గురువారం గ్రూప్ సెంటర్ సీఆర్పీఎఫ్ హైదరాబాద్ చాంద్రాయనగుట్టలో జరిగింది.
అట్టహాసంగా సీఆర్పీఎఫ్ ఫిట్ ఇండియా కార్యక్రమం - తెలంగాణ వార్తలు
ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ సెలబ్రేషన్ కార్యక్రమం గ్రూప్ సెంటర్ సీఆర్పీఎఫ్ హైదరాబాద్ చాంద్రాయనగుట్టలో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని సీఆర్పీఎఫ్ సెంటర్లు కలిసి నెలలో కోటి కిలోమీటర్ల పరుగు, నడక నిర్వహిస్తామని లక్ష్యంగా తీసుకున్నారు.
అట్టహాసంగా సీఆర్పీఎఫ్ ఫిట్ ఇండియా కార్యక్రమం
ప్రతి జవాన్ రోజూ ఉదయం 5 కిలోమీటర్లు, వారి కుటుంబ సభ్యులు 3 కిలో మీటర్ల పరుగు, నడక కొనసాగిస్తామని ప్రతినబూనారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఆర్పీఎఫ్ సౌత్‌జోన్ డీఐజీపీ ఎంఎస్ షెఖావత్ హాజరయ్యారు. కార్యక్రమంలో సౌత్ జోన్ డీఐజీపీ సిటీ వెంకటేష్ పాల్గొన్నారు. పరుగులో ప్రతిభ కనబర్చిన వారికి నిర్వాహకులు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఇదీ చూడండి:'హైదరాబాద్‌లో ఇండో- సోమాలియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం'
Last Updated : Oct 2, 2020, 5:54 PM IST