'ఆత్మస్థైర్యం తగ్గదు' - కౌముదితో ముఖాముఖి
పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం ఇరు దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడిని ప్రతీ భారతీయుడు స్వాగతించాడు. ఎలాంటి ఘటనలు జరిగినా జవాన్లు ఆత్మస్థైర్యం కోల్పోకుండా దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరని సీఆర్పీఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వి.ఎస్.కె.కౌముది అన్నారు.

జవాన్లు
పుల్వామా దాడి జవాన్ల ఆత్మస్థైర్యాన్ని ఎంత మాత్రం దెబ్బతీయలేదని సీఆర్పీఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వి.ఎస్.కె.కౌముది అన్నారు. జమ్మూ కశ్మీర్లో శాంతి స్థాపనకు నిరంతరం కృషి చేస్తుంటామని.. యువత ఉగ్రవాద చర్యలకు దూరంగా ఉండేలా సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమ సైనికులు ధైర్యంగా శత్రువులతో పోరాడుతారన్న కౌముదితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
సీఆర్పీఎఫ్ ఏడీజీ కౌముదితో ముఖాముఖి