తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండో డోసు కోసం వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద జనం పడిగాపులు - వనస్థలిపురంలో వ్యాక్సిన్ కేంద్రాలు

రెండో డోసు కోసం వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. వనస్థలిపురం ఏరియా ఆస్పత్రి వద్ద టీకా కోసం జనాలు ఉదయం నుంచే బారులు తీరారు. గంటల తరబడి వేచిచూస్తున్నా వ్యాక్సిన్ ఇవ్వటం లేదని ఆరోపించారు. అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

crowds-lined-up-at-vaccine-centers-for-a-second-dose-in-telangana
రెండో డోసు కోసం వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన జనాలు

By

Published : May 8, 2021, 1:00 PM IST

రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత ఉందని ఇప్పటికే తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని తెలిపింది. ఈ క్రమంలో మొదటి డోసు వ్యాక్సినేషన్‌ను ఈ నెల 15 వరకు ఆపేస్తున్నట్లు ప్రకటించి... నేటి నుంచి రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు.

అధికారుల సూచనతో వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద రెండో డోసు కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రి వద్దకు తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో స్థానికులు చేరుకున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్నా... వ్యాక్సిన్ ఇవ్వటం లేదని ఆరోపించారు. అధికారుల కాలాయపన వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా త్వరతగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాప్రా సర్కిల్ జమ్మిగడ్డలోని ఆరోగ్య కేంద్రంలోనూ ఉదయం నుంచే వ్యాక్సిన్‌ కోసం వరుస కట్టారు.

రెండో డోసు కోసం వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన జనాలు

ఇదీ చూడండి:కొవిడ్‌ చికిత్సలో సీటీ స్కాన్‌ ఎంత మేరకు ఉపయోగపడుతుంది?

ABOUT THE AUTHOR

...view details