తెలంగాణ

telangana

ETV Bharat / state

తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ, ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సర్వదర్శనం క్యూలైన్‌ గోగర్భం జలాశయం వరకు ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 48 గంటలకు పైగా సమయం పడుతుందని తితిదే ప్రకటించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 20వరకు ప్రత్యేక దర్శనాలను తితిదే రద్దు చేసింది.

tirumala
తిరుమలలో ప్రత్యేక దర్శనాలు రద్దు

By

Published : Aug 13, 2022, 10:39 PM IST

Updated : Aug 14, 2022, 7:42 AM IST

శ్రీవారి దర్శనానికి భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. వరుస సెలవులు, పెళ్లి ముహూర్తాల కారణంగా రద్దీ భారీగా పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు రోజుల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని తితిదే అధికారులు తెలిపారు. స్వామి వారి ధర్మదర్శనానికి క్యూలైన్‌లో వచ్చిన భక్తులు శనివారం సాయంత్రానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగ్‌రోడ్డులోని ఆక్టోపస్‌ బిల్డింగ్‌ వరకు వేచి ఉన్నారు. దాదాపు ఆరు కిలోమీటర్లకుపైగా క్యూలైన్లు, రింగ్‌రోడ్డులో రద్దీ నెలకొంది. వీరి దర్శనానికి 48 గంటలకుపైగా సమయం పడుతోందని తితిదే ప్రకటించింది.

ఒకే రోజు 64,079 మందికి శ్రీవారి దర్శనం:శ్రీవారి దర్శనానికి అనూహ్యంగా పెరిగిన రద్దీతో తితిదే సిఫార్సు లేఖలపై జారీ చేసే బ్రేక్‌, వృద్ధులు, వికలాంగుల దర్శనాలను ఈ నెల 21 వరకు రద్దు చేస్తున్నామని తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రద్దీ తగ్గే వరకు తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం 64,079 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రూ.3.52 కోట్ల హుండీ కానుకలు లభించాయి. 32,852 మంది తలనీలాలు సమర్పించారు. తిరుమలలో గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Aug 14, 2022, 7:42 AM IST

ABOUT THE AUTHOR

...view details