తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్​కు హరిత కానుక ఇవ్వడానికే.. కోటి వృక్షార్చన' - cm kcr birthday celebrations in telangana

ప్రకృతి, పచ్చదనం గురించి బాగా తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ అన్నారు. అందుకే ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా హరిత కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో కోటి వృక్షార్చన కార్యక్రమానికి నాంది పలికినట్లు తెలిపారు.

Crore tree planting program on February 17 on the occasion of cm kcr's birthday
కేసీఆర్​కు హరిత కానుక

By

Published : Feb 16, 2021, 3:37 PM IST

ఫిబ్రవరి 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమం చేపట్టినట్లు రాజ్యసభ ఎంపీ సంతోశ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా శంషాబాద్ విమానాశ్రయంలో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేశారు.

బుధవారం జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరారు. వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. కొచ్చి నుంచి శంషాబాద్​కు వచ్చిన శ్రీనివాస్-సుమలత దంపతులు మొదటి మొక్కను అందుకున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెెంజ్​లో భాగంగా మొక్కలు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని ప్రయాణికులు ప్రశంసించారు. తమకు ఇచ్చిన మొక్కలను ప్రేమగా పెంచుతామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో విమానాశ్రయ సీఈఓ ప్రదీప్ పానేకర్ పాల్గొన్నారు. మూడేళ్లుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో తామూ పాల్గొంటున్నామని తెలిపారు. పచ్చదనానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా విమానాశ్రయ పరిసరాల్లో ప్రతిఏటా మొక్కలు నాటుతున్నామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details