తెలంగాణ

telangana

ETV Bharat / state

crop-rains: నిండా ముంచిన అకాల వర్షాలు.. తేేరుకోలేకున్న రైతులు - తెలంగాణ తాజా వార్తలు

crop loss: వరుణుడి ఆట అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. పంట చేతికొచ్చి ధాన్యం కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమయంలో పదిహేను రోజులుగా ఊహించని విధంగా విరుచుకుపడుతోంది. దీంతో అటు కోతకు సిద్ధంగా ఉన్న పంటతో పాటు కొనుగోలుకు తరలించిన ధాన్యం వర్షార్పణమవుతోంది. మరోవైపు మొక్కొజన్న, మామిడి, మిర్చి, ఇతర పంటలు వర్షాలకు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

crop loss in telangana due to heavy rains
నిండా ముంచిన అకాల వర్షాలు.. తేేరుకోలేకున్న రైతులు

By

Published : May 1, 2023, 1:59 PM IST

crop loss: రాష్ట్రంలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. వరుసగా విరుచుకుపడుతున్న వానలతో తడిసిన ఆరేలోపే మళ్లీ వర్షం కురుస్తూ అన్నదాతలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మండు వేసవిలో ఓ వైపు ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగానే అంతలోనే దంచికొడుతున్న వానలతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు.
నిన్న రాత్రి కురిసిన వానకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పంటలకు అపార నష్టం కలిగింది. జగిత్యాల జిల్లాలో నిన్న రాత్రి గంటల తరబడిగా కురిసిన వానకు కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు ఉదయం నీళ్లలో తేలియాడాయి. వెల్గటూరులో అత్యధికంగా 83 మిల్లీ మీటర్ల వర్ష కురియగా.. బుగ్గారం, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, జగిత్యాల, మల్యాల, కొడిమ్యాల, సారంగపూర్‌ మండలాల్లో భారీ వర్షం కురిసింది. కొతకొచ్చిన పంటలు నేలకొరగగా మామిడికాయలు పెద్దఎత్తున రాలిపోయాయి.. నీటి ప్రవాహనికి కొట్టుకుపోయిన వరి ధాన్యం ఎత్తుకోలేక ఉదయం రైతులకు అవస్థలు పడుతున్నారు.

చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం: అటు వరంగల్ జిల్లాలోనూ అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం నీటమునిగింది. వర్ధన్నపేటలోని కొనుగోలు కేంద్రం చెరువు తలపిస్తోంది. రాయపర్తి, పర్వతగిరి, సంగెం, ఐనవోలు మండలాల్లో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను తీవ్ర నష్టాల ఊబిలోకి నెట్టాయి. మొలకెత్తిన ధాన్యాన్ని చేస్తూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. జనగామ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన వానకు మొక్కజొన్న పంటలు పెద్దఎత్తున నేలకొరిగాయి. కష్టపడి పండించిన పంట నీటి పాలవటంతో పెట్టుబడి కుడా వచ్చేలా లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వారం రోజులు నుంచి కురుస్తున్న వర్షాలకు మించి నిన్న రాత్రి వర్షం కురిసింది. ముచినిపర్తి గ్రామంలో ఓ రైతుకు చెందిన మిర్చి మొత్తం కొట్టుకుపోయింది. కల్లాల్లో ఆరబోసిన పంట కిలోమీటర్‌ మేరకు నీటిపాలైంది. చల్లగరిగెలో మిర్చి వర్షార్పణం కాగా కుటుంబాలతో కలిసి రైతులు ఆరబెట్టుకుంటున్నారు. ఈదురుగాలులు, వడగళ్ల వానకు చేతికి వచ్చిన పంటలు నేలపాలు అయ్యాయి. నల్గొండ జిల్లాలోనూ అకాల వర్షాలు నిండా ముంచాయి. నకిరేకల్‌ మండలం నోముల గ్రామం ఐకేపీ సెంటర్‌కు తెచ్చిన ధాన్యం వానకు కొట్టుకుపోయింది. నీటిలోని ధాన్యాన్ని ఎత్తుకుంటున్న రైతులు మరోచోట ఆరబోస్తున్నారు.

ఉప్పొంగుతున్న మూసీనది: భారీ వర్షాలకు మూసీ నది ఉప్పొంగుతోంది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామ సమీపంలోని భీమలింగం కత్వ వద్ద లోలెవల్ బ్రిడ్జి మీద నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో భువనగిరి మండలం బొల్లేపల్లి - చౌటుప్పల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బీబీనగర్ మండలం రుద్రవెళ్లి వద్ద లోలెవల్ బ్రిడ్జి మీద నుంచి ప్రవాహంతో బీబీ నగర్ - పోచంపల్లి మధ్య రాకపోకలకు అంతరాయం నెలకొంది. అకాల వర్షాలకు భువనగిరి మార్కెట్ యార్డులో ధాన్యం రాశులు తడిసి మొలకలు వచ్చాయి. కష్టం నీటిపాలవుతుండటంతో అన్నదాతలు తలలు బాదుకుంటున్నారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనూ అకాల వర్షాలు పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగకపోవటంతో కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం బయటే ఉంచాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే వర్షాలు కురవటంతో తడిసిముద్దైంది. రాత్రి వర్షానికి కొట్టుకుపోయిన వరిధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

"అకాల వర్షాలతో పండించిన పంట అంతా చేతికందకుంటాపోయింది. పంటను కోయకుండా ఉన్నవాళ్లవి వడ్లు రాలడం, కల్లాల్లో ఉన్నవి తడిసిపోవడం జరిగింది. ఎడతెరపి లేకుండా వానలు కురవడం వల్ల పంటను ఆరబోసే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది."_రైతులు

నిండా ముంచిన అకాల వర్షాలు.. తేేరుకోలేకున్న రైతులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details