Crop Damage Due to Michaung Cyclone in Telangana :ఏపీలో తీరందాటిన మిగ్‌జాం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో భారీవర్షాలు కురిశాయి. అత్యధికంగా అశ్వరావుపేటలో 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో కురిసిన భారీవర్షానికి వరి, పత్తికి ఆపార నష్టం వాటిల్లింది. రోడ్లపై ఆరబోసిన వడ్లు వర్షాలకు పూర్తిగా తడిసిపోయాయి.
Peanut Crop Heavy Damage in Khammam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలతో సుమారు 4 వేల ఎకరాలకుపైగా వేరుశనగ దెబ్బతింది. ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడ్డాయి. బుధవారం పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మలుగు జిల్లాతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ(Department of Meteorology Instructions on Rains) హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కోంది. రాష్ట్రవ్యాప్తంగా జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మిగ్ జాం తుఫాను ప్రభావం - నష్టాల్లో మునుగుతున్న తెలంగాణ రైతులు
Crop Damage in Telangana Due to Sudden Rains : పంటలకోత ముగింపు దశలో భారీ వర్షాలు(Telangana Heavy Rains), ఈదురు గాలులతో రైతులు నష్టపోయారు. పొలాల్లో కోసి ఉంచిన వరి, కల్లాలో ఆరపెట్టిన పంట, కోనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తడిసిపోయిందని అన్నదాతలు వాపోయారు. పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది. యాసంగి సీజన్‌లో సాగు చేసిన పంటపొలాల్లోకి నీరు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 వేల ఎకరాల్లో పత్తి ఏరుతున్నారు. ప్రస్తుతం వర్షాలు కురువడంతో తీవ్రంగా నష్టం వాటిల్లింది. సుమారు 82 వేల ఎకరాల్లో కూరగాయలు సాగుచేయగా జోరువాలనలకు అవి దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, సిద్దిపేట జిల్లాలో కూరగాయ పంటలకు తీవ్ర నష్టం జరిగింది.