compensation credited to Telangana Farmers: గత మార్చి నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు పంటను నష్టపోయారు. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతుల రోదనకు అవధుల్లేకుండా పోయింది. అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టి, కష్టపడి పండించిన పంట చేతికి వచ్చింది అని మురిసేలోపే అకాల వర్షాలు వారి చేత కన్నీటిని పెట్టించాయి. లక్షల్లో రైతులు నష్టపోయారు. వర్షం కారణంగా దెబ్బ తిన్న పంటను అమ్ముకోలేక ఏమీ చెయ్యాలో తెలియక రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. రైతన్నలు ప్రభుత్వమే తమని ఆదుకోవాలని కోరారు. వర్షాలకు ధాన్యానికి మొలకలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Crop Loss Compensation To Farmers' Accounts :గత మార్చి 16 నుంచి 21 వరకు తెలంగాణలోని 26 జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్లతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభత్వం రూ.151.46 కోట్ల పరిహారం విడుదల చేసింది. ఈ నిధులను జిల్లాల వారీగా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులకు పంపించి, నేరుగా రైతుల ఖాతాల్లో వేయాలని ఆదేశించింది. గతంలో పరిహారంగా చెక్కులను అందజేసేవారు. ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నేరుగా నగదు బదిలీకి ఆదేశించారు. మార్చిలో కురిసిన అకాల వర్షాలతో వరి, జొన్న, మిర్చి, వేరుసెనగ, పత్తి, కూరగాయలు, మామిడితోటలు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్, ఖమ్మం, కరీంనగర్,మహబూబాబాద్ జిల్లాల్లో పంట నష్టాలను స్వయంగా పరిశీలించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వ్యవసాయశాఖ సర్వేలు నిర్వహించి 1,51,645 ఎకరాల నష్టాన్ని నమోదు చేసింది. దీనికి అనుగుణంగా 1,30,988 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేయాలని ఆదేశించింది. మహబూబాబాద్ జిల్లాలో 12,684 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం పరిహారం జమ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ ఒకట్రెండు రోజుల్లో పడనున్నాయి.
compensation Cash credited Telangana Farmers' Accounts :పంట నష్టంపైప్రభుత్వం స్పందించి రైతులందరినీఆదుకుంటామని, పంట పరిహారాన్ని చెల్లిస్తామని హామీ ఇచ్చింది.కాగా ప్రతి ధాన్యపు గింజను కొంటామని భరోసా ఇచ్చింది. మొదట్లో కొనుగోళ్ల విషయంలో జాప్యం చోటుచేసుకుంది. ఎండబెట్టిన ధాన్యాన్ని తేమ లేదని మిల్లర్లు క్వింటాకు 10 కిలోల చొప్పున కోతలు విధించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చింది. మొదట్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో జాప్యం చోటుచేసుకున్న తరువాత ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేసింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం ఇంకా డబ్బులు చెల్లించలేదు. కొన్న ధాన్యానికి తొందర్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: