ఏపీ ప్రకాశంజిల్లా కురిచేడు మండలం బయ్యారం గ్రామం వద్ద మొసలి సంచరిస్తోందనే వార్త స్థానికంగా సంచలనం రేపింది. కాలువ గట్టు మీద మొసలి తలవాల్చి కదలకుండా సుమారు రెండు గంటలవరకు పడుకొని అలానే ఉందని జనార్దన్ అనే వ్యక్తి తెలిపాడు. బైక్మీద సాగర్ కాలువ కట్టపై ప్రయాణిస్తుండగా... గట్టుమీద ఉన్న మొసలిని చూశానన్నాడు.
నాగార్జునసాగర్ ప్రధాన కాలువలో మొసలి కలకలం - ప్రకాశం తాజా వార్తలు
నాగార్జునసాగర్ ప్రధాన కాలువలో మొసలి సంచరిస్తోందనే వార్తతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మొసలి జాడ మాత్రం తెలియలేదు. రేపు మరోసారి గాలించి... మొసలిని పట్టి వేరేచోటకు తరలిస్తామని అటవీ శాఖాధికారి తులసీరావు తెలిపారు.
నాగార్జున సాగర్ ప్రధాన కాలువలో మొసలి కలకలం
అనంతరం ఆ దృశ్యాన్ని చరవాణితో చిత్రీకరించి వాట్సాప్ గ్రూపులలో పెట్టాడు. విషయం తెలుసుకున్న అటవీ శాఖాధికారులు, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మొసలి జాడ మాత్రం తెలియలేదు. రేపు మరోసారి గాలించి మొసలిని కనుగొని పట్టి వేరేచోటకు తరలిస్తామని అటవీ శాఖాధికారి తులసీరావు తెలిపారు.
ఇదీ చదవండీ...నాగార్జునసాగర్ పరిధిలో చిరుత పాద ముద్రల కలకలం