రాష్ట్రంలో నేర నియంత్రణ, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడం, అన్ని పోలీస్‌స్టేషన్ల సరిహద్దుల నిర్ధరణకు స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని పోలీస్‌శాఖ నిర్ణయించింది. ఈ అంశాలపై డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం తెలంగాణ స్టేట్ రిమోట్‌సెన్సింగ్ అప్లికేషన్‌సెంటర్ కార్యాలయంలో ట్రాక్ అడిషనల్ డైరెక్టర్‌జనరల్ శ్రీనివాస్‌రెడ్డి, ట్రాక్ సైంటిఫిక్ ఇంజినీర్లతో సమావేశం జరిపారు. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ, మెరుగైన ట్రాఫిక్ వ్యవస్ధ ఏర్పాటుతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు డీజీపీ అన్నారు. అందుకు తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందేందుకు త్వరలోనే ఎంఓయూ కుదుర్చుకోనున్నట్టు తెలిపారు.
నేరాల నియంత్రణకు రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో ఒప్పందం! - హైదరాబాద్ వార్తలు
ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా రాష్ట్రంలో నేరాలను తగ్గించవచ్చని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై గురువారం తెలంగాణ స్టేట్ రిమోట్‌సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ కార్యాలయంలో ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు.
తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి
పోలీసుశాఖ అధికారులు, సిబ్బంది,ఐటీ,రిమోట్ ఆధారిత పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా మెరుగైన పౌర సమాజాన్ని రూపొందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి మరణాలు అధికంగా సంభవించే ప్రాంతాలు, కీలక రోడ్డు మలుపులతో కూడిన సమగ్ర సమాచారం కలిగిన మ్యాపింగ్‌ను ట్రాక్ సహాయంతో చేపట్టనున్నట్టు డీజీపీ వివరించారు. దీంతో పాటుగా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల సరిహద్దులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి మ్యాపింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, అదనపు డీజీ జితేందర్, అదనపు డీజీ అభిలాష్ బిస్త్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'అభివృద్ధి చేసే నేతలకే ఓటేద్దాం...'