కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం ఇచ్చిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీరాజ్ పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోడానికి దాతలు ముందుకు రావాలని మిథాలీ కోరారు. ప్రజలు స్వీయ నియంత్రణను పాటించడం వల్ల తమతో పాటు తమ చుట్టుపక్కల వారినీ కాపాడిన వారవుతారని తెలిపారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలి: మిథాలీరాజ్ - latest news on cricker mithaliraj
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీరాజ్ కోరారు. ఎల్బీ స్టేడియంలో పాత్రికేయులకు నిత్యావసర సరుకులు అందజేశారు.
పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలి: మిథాలీరాజ్