సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో బర్కత్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి బెట్టింగ్ రాకెట్‌కు తెరలేపాడు. భారత్‌లో అయితే న్యాయ పరమైన చిక్కులు వస్తాయని అమెరికా వెళ్లి మ్యాచ్ బాక్స్ డాట్ కాం అనే మొబైల్ యాప్‌ని సృష్టించాడు. హైదరాబాద్‌తో పాటు గోవా, బెంగళూరు నగరాల నుంచి కొంత మందిని యాప్‌లో చేర్చుకుని కమిషన్ ద్వారా బెట్టింగ్ నిర్విహిస్తున్నాడు. బెట్టింగ్ ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎనిమిది లక్షల రూపాయల నగదు, ఆరు చరవాణులు, కారు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు బర్కత్ అమెరికాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు - cricket
పోలీసులు నిఘా పెంచడం వల్ల పందెం రాయుళ్లు కొత్త మార్గాల్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వరల్డ్‌కప్ సందర్భంగా చరవాణుల్లో అక్రమంగా యాప్‌లు తయారుచేసి విదేశాల నుంచి ఆపరేట్ చేస్తు కోట్లు గడిస్తున్నారు. నగరంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
బెట్టింగ్ ముఠా
Last Updated : Jun 13, 2019, 6:34 AM IST