స్థిరాస్తి రంగం తిరిగి పుంజుకోవాలంటే బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాలని క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈఎంఐల చెల్లింపులు సైతం ఆరు నెలలు వాయిదా వేయించేందుకు కేంద్రం చొరవ చూపాలని అభిప్రాయపడ్డారు.
లాక్డౌన్ ప్రభావం స్థిరాస్తి ధరలపై పడదని తెలిపారు. ముందే ధరలు నిర్ణయమై ఉన్నందున ధరలు తగ్గడం, పెరగడం జరగదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించి... ఆ ప్రభావం నిర్మాణ రంగంపై తీవ్రంగా ఉందని చెబుతున్న క్రెడాయ్ రాష్ట్ర అధ్యక్షుడు మురళి మోహన్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి.
ప్రశ్న :లాక్ డౌన్ అమలు వల్ల నిర్మాణ రంగం తిరిగి పుంజుకుంటుందా ? ముందున్న పరిస్థితులు రావాడానికి ఎంత కాలం పడుతుంది ?
జవాబు :లాక్ డౌన్ వల్ల నిర్మాణ రంగం అంతా ఎక్కడికక్కడ స్తంభించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా సమస్యను ఎదుర్కొంటున్నాం.
ప్రశ్న :దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు ? పెద్ద ఎత్తున ఉన్న భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఏమిటి ? వారి సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ?