హైదరాబాద్ నగరంలో ఈనెల 16 నుంచి జరగనున్న స్థిరాస్తి ప్రదర్శన వాయిదా పడింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో వాయిదా వేస్తున్నట్లు.. క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షులు రామకృష్ణరావు, ప్రధానకార్యదర్శి రాజశేఖర్ రెడ్డిలు తెలిపారు.
కరోనా నేపథ్యంలో స్థిరాస్తి ప్రదర్శన వాయిదా - credai property show postponed in hyderabad
హైదరాబాద్‌లో నిర్వహించనున్న స్థిరాస్తి ప్రదర్శన వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో నిరవాధిక వాయిదా వేస్తున్నట్లు క్రెడాయ్ పేర్కొంది.
కరోనా నేపథ్యంలో స్థిరాస్తి ప్రదర్శన వాయిదా
హైటెక్స్‌లో ఈనెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న స్థిరాస్తి ప్రదర్శనను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 31 వరకు పెద్ద సంఖ్యలో జనం ఒక చోటికి జమ కాకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయన్నారు. స్థిరాస్తి ప్రదర్శనను తిరిగి ఎప్పుడు అన్నది మళ్లీ ప్రకటన చేస్తామని వివరించారు.
- ఇదీ చదవండి :సరుకు రవాణా రంగానికి లారీ డ్రైవర్ల కొరత