తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏప్రిల్​ 16 నుంచి స్థిరాస్తి ప్రదర్శన: రామకృష్ణారావు - credai property shoe latest news

ఏప్రిల్​ 16 నుంచి స్థిరాస్తి ప్రదర్శనను నిర్వహించనున్నట్లు హైదరాబాద్​ క్రెడాయ్ అధ్యక్షుడు రామకృష్ణారావు వెల్లడించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో మొత్తం 74 సంస్థలు పాల్గొంటున్నట్లు తెలిపారు.

credai property Exhibition in April
ఏప్రిల్​ 16 నుంచి స్థిరాస్తి ప్రదర్శన: రామకృష్ణారావు

By

Published : Mar 19, 2021, 7:55 PM IST

స్థిరాస్తి ప్రదర్శనను ఏప్రిల్​ 16 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ క్రెడాయ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, రాజశేఖర్​రెడ్డిలు పేర్కొన్నారు. కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది స్థిరాస్తి ప్రదర్శన కాస్త ఆలస్యమైందని తెలిపారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్న ఈ ప్రదర్శనలో మొత్తం 74 స్థిరాస్తి సంస్థలు పాల్గొంటున్నట్లు వివరించారు.

కొవిడ్‌ తర్వాత స్థిరాస్తి రంగం ఊపందుకుందని రామకృష్ణారావు పేర్కొన్నారు. ఈ స్థిరాస్తి ప్రదర్శన ద్వారా కొనుగోలుదారులకు ఒకే చోట వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలకు చెందిన సమాచారాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. కరోనా నిబంధనల మధ్య ప్రదర్శన నిర్వహిస్తామని, మాస్క్‌ లేనిదే అనుమతించమని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: రక్షణ కల్పిస్తారు.. అవగాహన కోసం వీడియోలు రూపొందిస్తారు..

ABOUT THE AUTHOR

...view details