తెలంగాణ

telangana

ETV Bharat / state

రాయితీలతోనే మరింత వృద్ధి - NO 1 IN REAL ESTATE

రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్​లో శరవేగంగా వృద్ధి చెందుతోందని ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. క్రెడాయ్‌ ఆధ్వర్యంలో మాదాపూర్​లోని హైటెక్స్​లో ఏర్పాటు చేసిన 7వ ప్రాపర్టీషోను ప్రారంభించారు.

స్థిరాస్తి రంగంలో దూసుకెళుతున్న.. భాగ్యనగరం

By

Published : Feb 16, 2019, 8:21 AM IST

Updated : Feb 16, 2019, 11:29 AM IST

స్థిరాస్తి రంగంలో దూసుకెళుతున్న.. భాగ్యనగరం
హైదరాబాద్​లోని రియల్ ఎస్టేట్ రంగం ఇతర నగరాలతో పోల్చినపుడు అత్యద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తోందని క్రెడాయ్ ప్రకటించింది. మాదాపూర్​లో ఏర్పాటు చేసిన 7వ ప్రాపర్టీ షోను నిజామాబాద్​ ఎంపీ కవిత ప్రారంభించారు. 150 మందికి పైగా డెవలపర్లు, 15 వేలకు పైగా ప్రాపర్టీలతో కొలువైన ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు జరగనుంది.

దాదాపు లక్షమంది సందర్శిస్తారని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షులు రామ్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి కొనుగోలుదారులు తమకు నచ్చిన ప్రాపర్టీని ఎంచుకునేందుకు ప్రత్యేకంగా బీ2బీ లాంజ్ ఏర్పాటు చేశామన్నారు.

వ్యవసాయరంగం తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఉపాధి కల్పనలో ముందుందని.. ఈ రంగానికి ఇండస్ట్రీ హోదా ఇవ్వాలని ఎంపీ కవిత అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక రంగానికి ఇచ్చినట్లు రాయితీలు ఇవ్వాలన్నారు.

భవన నిర్మాణ రంగ నిపుణులు తమ ప్రాజెక్టులలో పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలని కవిత సూచించారు.

Last Updated : Feb 16, 2019, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details