తెలంగాణ

telangana

ETV Bharat / state

Credai Award for My Homes: మై హోమ్​ గ్రూప్​ ఛైర్మన్​కు క్రెడాయ్​ అవార్డు.. అందజేసిన గవర్నర్ - జూపల్లి రామేశ్వరరావు

Credai Award for My Homes: క్రెడాయ్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు మై హోమ్స్‌ గ్రూప్స్​కు దక్కింది. ఈ అవార్డును గవర్నర్ తమిళిసై​ చేతుల మీదుగా ఆ సంస్థ ఛైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు అందుకున్నారు. ఇవాళ హెచ్‌ఐసీసీలో జరిగిన మొట్టమొదటి టీఎస్‌-కాంక్లేవ్‌ 2021 కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు.

Credai Award for My Homes
మై హోమ్​ గ్రూప్​ ఛైర్మన్​కు క్రెడాయ్​ అవార్డు

By

Published : Dec 23, 2021, 7:19 PM IST

Credai Award for My Homes: ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల అని.. ఆ కలను సాకారం చేస్తున్న క్రెడాయ్‌ సభ్యులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అభినందించారు. క్రెడాయ్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును మై హోమ్​ గ్రూప్​ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావుకు గవర్నర్​ అందజేశారు. గడిచిన మూడు దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో ఉన్న రామేశ్వరరావు సమాజానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును క్రెడాయ్ అందజేసింది. ఇవాళ హైదరాబాద్​లోని హెచ్‌ఐసీసీలో జరిగిన మొట్టమొదటి టీఎస్‌-కాంక్లేవ్‌ 2021 కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేశారు.

ఇల్లు ప్రతి ఒక్కరి కల: గవర్నర్

governor presented award: సామాజిక బాధ్యతగా భావించి కొవిడ్‌ సమయంలో సేవలందించిన క్రెడాయ్‌ని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రశంసించారు. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని గవర్నర్‌ తమిళిసై అన్నారు. కరోనా నుంచి దూరమయ్యామని భావిస్తున్న తరుణంలో ఒమిక్రాన్‌ వేరియంట్ ప్రవేశించిందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని, వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని ఆమె సూచించారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇళ్లను నిర్మించాలని.. గాలి, వెలుతురు సజావుగా ఉండేట్లు చూడాలన్నారు. సామాజిక బాధ్యతను చూపిస్తున్న క్రెడాయ్‌ సభ్యులను గవర్నర్‌ కొనియాడారు.

jupally rameshwar rao got credai award: ప్రతి కస్టమర్‌ సంతోషం కోసం సేవలందించిన రామేశ్వరరావు ఎదిగే కొద్దీ ఒదిగిన మహోన్నత వ్యక్తిగా క్రెడాయ్‌ ప్రతినిధులు ప్రశంసించారు. హైరేంజ్ భవనాలను నిర్మించి.. అందంగా తీర్చిదిద్దడంలో ఆయనొక శిల్పిగా పని చేశారని కొనియాడారు. డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చేతుల మీదుగా ఆవార్డు అందుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని రామేశ్వరరావు అన్నారు. గడిచిన రెండు, మూడు సంవత్సరాలు నిర్మాణరంగంపై దృష్టి సారించలేకపోయానని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా తాను అందించిన సేవలను గుర్తించి క్రెడాయ్‌ అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గడిచిన ఏడేళ్లుగా చూస్తే హైరేంజ్​ భవనాల నిర్మాణంలో హైదరాబాద్‌ ప్రపంచపటంలో మంచి గుర్తింపు తెచ్చి పెట్టిందని జూపల్లి రామేశ్వరరావు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details