రాష్ట్రంలో లాక్‌డౌన్ సమయంలో నిర్మాణాలకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి క్రెడాయ్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్కు క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి విజ్ఞప్తి చేసారు. ఈ రోజు నుంచి పదిరోజులపాటు లాక్‌డౌన్ అమలులో ఉండటం వల్ల తాము ఈ ప్రతిపాదన చేసినట్లు రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నిర్మాణ ప్రాంగణాల్లో పనులు చేసుకోడానికి అనుమతివ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.
నిర్మాణ రంగానికి అనుమతివ్వాలని కేటీఆర్కు క్రెడాయ్ విజ్ఞప్తి - Credai appeals to KTR to allow construction sector works in lock down time
లాక్‌డౌన్ సమయంలో నిర్మాణ రంగానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి క్రెడాయ్ విజ్ఞప్తి చేసింది. కొవిడ్ నిబంధనలతో నిర్మాణ ప్రాంగణంలో పనులు చేసుకుంటామని క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి.. మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు.
నిర్మాణ రంగానికి అనుమతివ్వాలని కేటీఆర్కు క్రెడాయ్ విజ్ఞప్తి
తమిళనాడులో మాదిరి ఇక్కడా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పనులు చేసుకుంటామని మంత్రికి వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:కొవిడ్ బాధితుల కోసం ప్రత్యేక ఆల్కలైన్ హైడ్రోజన్ వాటర్