Crafts Bazaar At G20 Summit India 2023 :దిల్లీలో జరగనున్నజీ-20(G20 Summit at Delhi) సదస్సు ప్రపంచ దేశాల ప్రతినిధులకు చిరకాలం గుర్తుండిపోయేలా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతాన్ని మేళవించి ప్రత్యేకంగా క్రాఫ్ట్స్ బజార్‌ను ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న వైవిధ్యతను, శతాబ్దాల సాంస్కృతిక, హస్తకళా వైభవాన్ని విదేశీ ప్రతినిధులకు చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన ఈ క్రాఫ్ట్స్ బజార్(Craft Bazaar) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Traditional Crafts at G20 Summit 2023 : ముందుగానే తయారు చేసుకొచ్చిన హస్త కళాకృతులే(Handicrafts At G20 India 2023) కాకుండా అక్కడే అందరి ముందు తయారు చేసి చూపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తంజావూరు, రాజస్థాన్ చిత్ర కళాకృతులు అక్కడే అందరి ముందు రూపొందించి ఇచ్చే ఏర్పాట్లు చేశారు. వెల కట్టలేని కళాఖండాలు ఇక్కడ ఉంచడం ద్వారా కళాకారులకు గుర్తింపు, వ్యాపార అవకాశాలు కల్పించడంతో పాటు, ఎంతో దూరం నుంచి వచ్చిన విదేశీయులు శ్రమ లేకుండా భారతీయ హస్త కళావైభవాన్ని ఆస్వాదించి.. నచ్చిన వాటిని కొనుగోలు చేసుకొని వెంట తీసుకెళ్లే వీలు కల్పించారు.
Indian Traditional Craft Bazaar in G20 Summit : ఉత్తర కశ్మీర్‌లో ప్రత్యేకత కలిగిన పేపర్ మాషే కళ నుంచి బిహార్ రాష్ట్రానికే తలమానికంగా ఉన్న మధుబని, తంజావూరు చిత్రకళలు, జైపుర గాజులు, నూలు వడకడం, మగ్గంపై చిత్రాలతో నేయడం వంటివి ఆహుతులను ఆధ్యంతం ఆకట్టుకుంటున్నాయి. ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు, దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి గుర్తింపు కల్పించేలా, గిరిజన కళలకు చేయూత అందించేలా, కుటీర పరిశ్రమకు ప్రోత్సాహం కల్పించేలా, వెదురు ఉత్పత్తులను ప్రపంచానికి చాటి చెప్పేలా.. ఈ హస్తకళా ప్రాంగణం కళకళలాడుతోంది.