తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం - etv bharat

ముఖ్యమంత్రి కేసీఆర్​ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగని అన్నారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని సూచించారు.

CR wishes Batukamma festival to the people of the state
ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

By

Published : Oct 16, 2020, 4:06 PM IST

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా నిలుస్తున్న బతుకమ్మ పండగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

పంటలు బాగా పండి వ్యవసాయం గొప్పగా వర్థిల్లాలని... ప్రతి ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లివెరిసేలా దీవించాలని అమ్మవారిని ముఖ్యమంత్రి ప్రార్థించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు బతుకమ్మ పండుగ జరుపుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:బతుకమ్మ కోసమే విరబూస్తున్నట్లుగా... కట్టిపడేస్తున్నాయ్

ABOUT THE AUTHOR

...view details