CR Reddy college old students: ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల 1985- 2012 సంవత్సరాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం హైదరాబాద్ పంజాగుట్టలో ఘనంగా నిర్వహించారు. ఈఎఫ్ఎస్ఐ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కళాశాల పూర్వ విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. తమ అనుభవాలు, ఘటనలు గుర్తు చేసుకుంటూ అధ్యాపకులతో ఆనందం పంచుకున్నారు. కళాశాలలో బోధించిన పాఠ్యాంశాలు శ్రద్దగా నేర్చుకుని ఉన్నత స్థానాలకు తమ విద్యార్థులు చేరుకున్నారని ఆ కళాశాల అధ్యాపకులు డాక్టర్ మంచాల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచి ప్రతీ సంవత్సరం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయాలనుకుంటున్నామని కళాశాల పూర్వ విద్యార్థి, కార్యక్రమ నిర్వహకులు డాక్టర్ ఎంఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు.
మేం దాదాపు చాలా మంది ఈ మీట్లో పాల్గొన్నాం. వైజాగ్ నుంచి కూడా వచ్చారు. చాలా మంది కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రతి సంవత్సరం ఒకసారి ఈ సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కొంతమంది ప్రైవేటులో, మరికొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించడం అందరు విద్యార్థులకు ఇది లాభదాయకం.
- డాక్టర్ ఎంఎస్ఆర్కే ప్రసాద్, కళాశాల పూర్వ విద్యార్థి
నేను సీఆర్ రెడ్డి కాలేజీలో 20 ఏళ్లుగా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో పనిచేశా. టీచింగ్ అంటేనే పిల్లల పర్సనాలిటీని తీర్చిదిద్దాలి. చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. సీఆర్ రెడ్డి కాలేజీ అంటేనే మర్చిపోలేని స్థితికి వచ్చింది. మా పిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.