CPR Training at Gandhi Hospital: అప్పటివరకు నవ్వుతూ నలుగురితో కబుర్లు చెబుతున్న వారు.. క్షణాల్లో కుప్పకూలేలా చేస్తుంది కార్డియాక్ అరెస్ట్. రెప్పపాటు కాలం గుండె పనిచేయటం ఆగితే చాలు.. ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. అలాంటి సమయంలో కార్డియో పల్మనరీ రిసస్టేషన్(C.P.R) చేయటం ద్వారా తిరిగి గుండె పనిచేసేలా చేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి సీపీఆర్ తెలిసి ఉండాలంటున్నారు వైద్యులు.
ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి విద్యార్థుల సంఘం, గాంధీ మెడికల్ కాలేజీ గ్లోబల్ అలయెన్స్, జనహితా సేవా ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి హాజరైన గవర్నర్ తమిళిసై.. సీపీఆర్ వ్యక్తుల ప్రాణాలు కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. గతంలో తాను విమాన ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రయాణికుడికి సీపీఆర్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.
"విదేశాల్లో 60 శాతం మందికి సీపీఆర్‌పై అవగాహన ఉంటుంది. కానీ మన దేశంలో 2 శాతం మాత్రమే జనాలకు సీపీఆర్‌పై అవగాహన ఉంది. కార్డియాక్ అరెస్ట్ అయిన వారిలో కొద్దినిమిషాల్లో వారికి సీపీఆర్ చేస్తే వారి ప్రాణాలు కాపాడుకోగలం. ప్రభావంతమైన సీపీఆర్ ఉంటే వెంటనే మనిషిని బతికించుకోగలం. ఈ ప్రయత్నం చేస్తోన్న అందరికి ధన్యవాదములు"- తమిళిసై సౌందర రాజన్, గవర్నర్
విదేశాల్లో 60శాతం మందికి సీపీఆర్‌పై అవగాహన ఉంటుంది. భారత్‌లో 2శాతం మందికి మాత్రమే దీనిపై అవగాహన ఉంది. కార్డియాక్ అరెస్టు వచ్చిన కొన్ని నిమిషాల్లో సీపీఆర్ చేస్తే వ్యక్తిని బతికించుకోగలం. ఇది కూడా పూర్తిస్థాయిలో ఉండాలి. దీనిని ఎందుకు నేర్చుకోవాలంటే.. ప్రభావవంతమైన సీపీఆర్ ఉంటేనే ప్రాణాలు కాపాడుకోగలం. ఈ ప్రయత్నం చేస్తున్న అందరిని ప్రశంసిస్తున్నాను.