మతోన్మాదంపై సీఎం కేసీఆర్ అఖిలపక్ష సభ ఆలోచన సబబైందేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. ఎన్‌పీఆర్, ఎన్నార్సీ, సీఏఏను అమలు జరపబోమని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రుల అధ్వర్యంలో దీక్షలు, భారీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ మౌనంగా ఉండటం పట్ల తెలంగాణ సమాజం ఆందోళన చెందుతుందన్నారు. జనవరి 30న గాంధీ వర్థంతి రోజు సందర్భంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా భాజపాయేతర పార్టీలతో అఖిలపక్ష సభను జరపాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకే భాజపా,ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు.
రిజర్వేషన్లు ప్రకటించకుండానే షెడ్యూలేంటీ?