హైకోర్టు ఇచ్చిన సూచనలు కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ... ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పలు డిపోల ముందు కుటుంబ సభ్యులతో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసనల్లో తమ్మినేని పాల్గొన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు పూలిచ్చి తమకు మద్దతివ్వాలని విన్నవించారు. అన్ని వర్గాల వారు బంద్‌లో పాల్గొని విజయవంతం చేశారని తమ్మినేని తెలిపారు. కార్మికులకు సీఎం కేసీఆర్ అన్ని మార్గాలు మూసేయటం వల్ల పోరాటం ద్వారా తమ హక్కులు సాధించుకునేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకారం రానున్న రోజుల్లో మరింత ఉద్ధృతంగా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఇకనైనా కేసీఆర్ కళ్ళు తెరిచి సామరస్యపూర్వకంగా చర్చలకు ఆహ్వానించాలని తమ్మినేని వీరభద్రం కోరారు.
'కార్మికులు సమరోత్సాహంతో ఆందోళనల్లో పాల్గొంటున్నారు' - హైదరాబాద్‌లోని పలు డిపోల ముందు నిరసన
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని పలు డిపోల ముందు నిరసన తెలియజేశారు. ఈ నిరసనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. కార్మికులు ఏమాత్రం నిరుత్సాహ పడకుండా... సమరోత్సాహంతో ఆందోళనల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
CPM TAMMINENI VEERABADRAM PARTICIPATED IN 17TH DAY TSRTC STRIKE IN HYDERABAD